క్షమాపణ చెప్పేందుకు నామోషీ ఎందుకు?

16 May, 2017 03:29 IST|Sakshi
క్షమాపణ చెప్పేందుకు నామోషీ ఎందుకు?

క్షమాపణ చెప్పేందుకు నామోషీ ఎందుకు?ను ప్రశ్నించిన ఇంద్రసేనారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  రైతులపై పెట్టిన కేసులను రద్దు చేసి క్షమాపణ చెప్పేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నామోషీ ఎందుకని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఫ్రశ్నించారు. రైతులకు బేడీలు వేసే మూర్ఖులుంటారా అని ఇటీవల సీఎం కేసీఆర్‌ అన్నారని, అయితే తాము మూర్ఖులం కాదని నిరూపించుకునే అవకాశాన్ని ఎందుకు వదులు కుంటున్నారని నిలదీశారు. సోమవారం పార్టీ నాయకులు రఘునందన్‌రావు, సుధాకరశర్మ, జి.భరత్‌గౌడ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమస్యలను చూస్తేనే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు.

ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద స్థానికులను అడ్డుపెట్టుకోవా లనుకోవడం సరికాదన్నారు. ఒకే అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాలకు అనుమతినిచ్చిన మూర్ఖత్వం కేసీఆర్‌ ఫ్రభుత్వానిదేనని అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలవగానే ఏదో జరిగిందనే ప్రచారం సరికాదని ఒక ప్రశ్నకు ఇంద్రసేనారెడ్డి బదులిచ్చారు. ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చునని అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాధినేతలను విపక్షాలకు చెందిన వారు కలుస్తుంటారని దానిపై ఏవో అర్థాలు తీయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు