కిమ్‌కు ‘పెద్ద పోస్టు’

1 Jul, 2016 15:42 IST|Sakshi
కిమ్‌కు ‘పెద్ద పోస్టు’

సియోల్: తమ దేశ విధానానికి సంబంధించిన ప్రతి అంశంపైనా సంపూర్ణ నియంత్రణ ఉండేలా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ నేతృత్వంలో ‘అత్యున్నత పరిపాలన కమిషన్’ ఏర్పాటైంది. ఈ మేరకు కిమ్‌ను కమిషన్ చైర్మన్‌గా దేశ చట్ట సభ, సుప్రీం పీపుల్ అసెంబ్లీ (ఎస్‌పీఏ) బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని ఉత్తరకొరియా అధికారిక కేఎసీఎన్‌ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

పాత ‘జాతీయ రక్షణ కమిషన్’ స్థానంలో ఈ కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కిమ్‌పై దేశ ప్రజలు, ప్రభుత్వ అధికారులకు అపార విశ్వాసముందని, ఆయనను అత్యున్నత పదవిలో చూడాలన్నది వారి దృఢమైన ఆకాంక్ష అని ఎస్‌పీఏ అధ్యక్షుడు కిమ్ యోంగ్ నామ్ అన్నారు.

మరిన్ని వార్తలు