చిక్కుల్లో ఆపిల్ | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ఆపిల్

Published Fri, Jul 1 2016 3:45 PM

చిక్కుల్లో  ఆపిల్ - Sakshi

ఫ్లోరిడా: అసలే  అమ్మకాలు పడిపోయి..  కోల్పోయిన  వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్న ఆపిల్  సంస్థను  వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా  తన కాపీరేట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేల కోట్ల దా వావేశాడు.  ఐఫోన్ ఆలోచన తనదేనని.. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్  తన ఐడియాను కొట్టేసిందని పోరాటానికి దిగాడు. ఫ్లోరిడాకు  చెందిన   థామస్ రాస్  ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ఈ వారం వ్యాజ్యం దాఖలు  చేశాడు.

ఆపిల్    సంస్థ తన ఐడియాను  హైజాగ్  చేసిందని తద్వారా   వేల కోట్లు ఆర్జిస్తోందని ఆరోపించాడు. ఇందుకు గాను  తనకు  సుమారు రూ. 74,177 కోట్లు (11బిలియన్ డాలర్లు)  నష్టపరిహారం చెల్లించాలని  కోరుతూ కోర్టు కెక్కాడు.  అలాగే ఆపిల్  ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో  కనీసం 1.5 శాతం ఒక సహేతుకమైన రాయల్టీ గా   చెల్లించాలని కోరుతున్నాడు. 1992 లోనే  ఐ ఫోన్  డిజైన్ ను రూపొందించానని వాదించాడు. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీసు అవసరం ఫీజు చెల్లించడంలో   విఫలమైన కారణంగా  1995 లో ఈ పేటెంట్ అప్లికేషన్  రద్దయిందని పేర్కొన్నాడు. ఈ డిజైన్ నమూనా కాపీని  కూడా జత చేశాడు.

గత ఏడాది తన డిజైన్  ను కాపీ రైట్ చేయించానని లా సూట్ లో పేర్కొన్నాడు.  తన మేధో సంపత్తిని  చట్ట విరుద్ధంగా యాపిల్ ఉత్పత్తుల్లో,  ప్యాకేజింగ్ లో వాడుకుంటోందని  ఆరోపించాడు.  తన సొంత ఆవిష్కరణలు కాకుండా  డంప్ స్టర్  డైవింగ్ (ఒక కంప్యూటర్ నెట్ వర్క పై దాడి చేసేందుకు వాడబడే సమాచారాన్ని పొందడానికి ఉపయోగించే ఒక టెక్నిక్)  కు పాల్పడుతోందన్నాడు.   తనకు యాపిల్ నుంచి ఎలాంటి వివరణ కానీ, ఖండనగానీ రాలేదని తెలిపాడు. కాగా 2001  ఎంపీ3  మ్యూజిక్ ప్లేయర్ తో ఐపాడ్ లాంచయింది.  అనంతరం ఆరేళ్ల తరువాత 2007 లో ఐ ఫోన్ ను  ప్రవేశపెట్టారు. అయితే రాస్  పిటిషన్ పై దీనిపై స్పందించేందుకు   ఆపిల్ నిరాకరించింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement