తన కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

8 Sep, 2016 02:43 IST|Sakshi
తన కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

బాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రోజా

 సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హోదాను కాపాడుకోవడం కోసం కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె తన సహచర ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరితో కలిసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, యువకులకు ఉద్యోగాలు వస్తాయని... అదే ప్యాకేజీలు వస్తే టీడీపీ నేతలకు కమీషన్లు వస్తాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాల్సిందేనని.. హోదా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అదేదో అనవసరమైన విషయంగా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

మరిన్ని వార్తలు