మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనలు

13 Sep, 2016 09:52 IST|Sakshi

హైదరాబాద్ :  త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన ‘ఈదుల్ అజ్‌ఉహా’ బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తిశ్రద‍్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా, మక్కా మసీద్‌లో మంగళవారం ఉదయం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామూహికంగా నమాజులు పఠించారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ వారు తమ ప్రార్థనలు కొనసాగించారు. అలాగే ఢిల్లీ జామా మసీదు పోటెత్తింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదుకు చేరుకుని ప్రార్థనలు చేశారు.

ఇక అల్లా ప్రసన్నుడైన దినంగా చెప్పుకునే బక్రీద్ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఈద్ ముబాకర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవిత్రమైన హృదయంతో అల్లాను ప్రార్థించి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. మరోవైపు బక్రీద్‌ను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, ఒంటెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

మరిన్ని వార్తలు