దేశవ్యాప్తంగా ఫీజు పథకం అమలు చేయాలి

13 Feb, 2018 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యానిధి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ లెజిస్లేచర్‌ కమిటీ ద్వారా కేంద్రానికి నివేదిక ఇచ్చామని చైర్మన్‌ గంగాధర్‌గౌడ్, సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. దీంతో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లు అవుతుందన్నారు.

దీనిపై ఈ నెల 22న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కృష్ణయ్య తెలిపారు. సోమవారం అసెంబ్లీ హాల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గ్రేటర్‌ అధ్యక్షుడు భుపేశ్‌ సాగర్, విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి గజేందర్‌ తదితరులు బీసీ లెజిస్లేచర్‌ కమిటీని కలసి ఫీజుల నియంత్రణపై అసెంబ్లీలో చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు