హైదరాబాద్లో ఎవరూ సెటిలర్లు కాదు: వెంకయ్య

31 Jan, 2016 12:36 IST|Sakshi
హైదరాబాద్లో ఎవరూ సెటిలర్లు కాదు: వెంకయ్య

హైదరాబాద్ : హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల రాజకీయాలతో రోహిత్ ఆత్మ బాధపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ...ఐసిస్ సానుభూతిపరులు మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా ఎంఐఎంపై మండిపడ్డారు. హెదరాబాద్లో ఎవరూ సెటిలర్లు కాదని.... అందరూ భారతీయులే అని వెంకయ్య స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్కో ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సమాజంలో దళితులు, దళితేతరులు అంటూ చర్చ తేవడమే దారణమన్నారు. అభివృద్ధి విషయంలో సమాజంలో అన్ని వర్గాలను మోదీ గౌరవిస్తారని వెంకయ్య గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే 20 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరచిన ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పారు. అలాగే రూ. 12 తో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదే అని వెంకయ్య నాయుడు తెలిపారు.

మరిన్ని వార్తలు