నయీమ్‌ ఇంట్లో మరోసారి సోదాలు

10 Aug, 2016 11:26 IST|Sakshi
నయీమ్‌ ఇంట్లో మరోసారి సోదాలు

హైదరాబాద్‌: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్‌కౌంటర్ తదనంతరం జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయీం ఇంట్లో బుధవారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్‌రూంను పోలీసులు తెరవనున్నట్టు తెలుస్తోంది. అతడి బెడ్‌రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదు ఉన్నట్లు సమాచారం ఉంది.

దాంతో తమ కస్టడీలో ఉన్న నయీం వంటమనిషి ఫర్హానా, డ్రైవర్‌ భార్య అఫ్షాలను నయీమ్‌ ఇంటికి పోలీసులు తీసుకెళ్లినట్టు తెలిసింది. నయీం ఇంట్లో పనిచేసే వీరిద్దరిని మూడురోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నయీం బాడిగార్డ్స్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు