జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు

18 Apr, 2016 18:34 IST|Sakshi
పంజగుట్ట (హైదరాబాద్) : తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు. 
 
ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు