దీపా కర్మకార్పై ప్రశంసల వర్షం

18 Apr, 2016 19:12 IST|Sakshi
దీపా కర్మకార్పై ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ:ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్పై సర్వత్రా ప్రశంలస వర్షం కురుస్తోంది. ఈ చారిత్రాత్మక ఫీట్తో ఆమె భారతీయ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. దీపా కర్మకార్ సాధించిన ఘనత అసాధారణమని సచిన్ పొగడ్తలతో ముంచెత్తాడు. దేశంలోని యువతలో మరింత స్ఫూర్తిని నింపడానికి ఆమె నమోదు చేసిన అరుదైన ఘనత కచ్చితంగా దోహదం చేస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆమెకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు దీపా సాధించిన ఘనత భారత జిమ్నాస్టిక్స్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందంటూ క్రీడామంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రశంసించారు.


బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్కు దీపా కర్మాకార్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది.  త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది.

>
మరిన్ని వార్తలు