గ్రాంట్ ఇన్ ఎయిడ్ కమిటీ ఏర్పాటు

21 Apr, 2016 03:19 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వేతర, స్వచ్ఛంద,సేవా సంస్థలకు కేంద్రం నుంచి అందే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరుకు ప్రతిపాదనలను పరిశీలించి, సిఫార్సు చేసేందుకు రాష్ట్ర స్థాయి మల్టీ డిసిప్లినరీ గ్రాంట్ ఇన్‌ఎయిడ్ కమిటీని ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా గ్రామీణాభి వృద్ధి, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, సికింద్రాబాద్ స్వీకార్ సంస్థ చైర్మన్ పి.హనుమంతరావు, భువనగిరి పీస్ సంస్థ నిమ్మయ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్ సెంటర్‌ఫర్ డెవలప్‌మెంట్ యాక్షన్ ప్రధానకార్యదర్శి కె.లక్ష్మి, సభ్యకార్యదర్శిగా ఎస్సీ శాఖ కమిషనర్/డెరైక్టర్ ఉం టారు. ఈ మేరకు ఎస్సీశాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఆదేశాలిచ్చారు.

మరిన్ని వార్తలు