రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు

2 Jun, 2016 20:40 IST|Sakshi

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వైపు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల తీవ్రత తగ్గినందున వడ గాలుల తీవ్రత కూడా తగ్గనున్నట్లు వివరించారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని, రాష్ట్రంలో వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్నారు.

దీంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వివరించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళను నైరుతి రుతుపవనాలు ఏడో తేదీన (నాలుగు రోజులు అటుఇటుగా) తాకుతాయని వివరించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి, తెలంగాణలోకి ప్రవేశిస్తాయన్నారు. మరోవైపు గత 24 గంటల్లో గద్వాల్ లో 3, మెదక్, టేకులపల్లిల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డుకాగా, ఆదిలాబాద్‌లో 44 డిగ్రీలు నమోదైంది.

మరిన్ని వార్తలు