బౌద్ధం స్వీకరించిన రోహిత్ తల్లి, సోదరుడు

14 Apr, 2016 13:12 IST|Sakshi

ముంబై:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ తల్లి రాధిక, అతని సోదరుడు రాజా మతం మారారు. ముంబైలో బౌద్ధమత గురువు సమక్షంలో వీరు  బౌద్ధమతాన్ని స్వీకరించారు. రోహిత్ దళితుడు కావడం వల్లే వివక్షకు గురై వెలివేయబడ్డాడని.. అటువంటి వెలివేతకు అవకాశంలేని బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ సోదరుడు అన్నారు. అసమానతలకు తావులేనిదిగా భావించి అంబేద్కర్ బౌద్ధం మతం స్వీకరించారని, అటువంటి సమానత్వాన్ని కాంక్షిస్తూ అంబేద్కర్ చూపిన మార్గంలో ఆయన జయంతిని పురస్కరించుకుని తాము బౌద్ధాన్ని స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

కొంతకాలంగా దేశంలో 'ఘర్ వాపసీ' గో మాంసం వివాదం, విద్యావ్యవస్థ కషాయీకరణ తదితర అంశాలపై దళిత, మైనారిటీ వర్గాలు ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే క్రమంలో అంబేద్కర్ విద్యార్థి సంఘం సభ్యుడు, హెచ్ సీయూ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో నిరసనలు, ఆందోళలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు