అర్ధరాత్రి వరకూ సిటీ బస్సులు

16 Sep, 2017 13:09 IST|Sakshi
అర్ధరాత్రి వరకూ సిటీ బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణ స్నేహితుడు శ్రావణ్‌ బెంగుళూరు వెళ్తుంటే తోడుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాడు. బస్‌ రాత్రి 11 గంటలకు స్నేహితుడు బస్‌ ఎక్కి వెళ్లిపోయాడు. ఇంక కొండాపూర్‌లోని తన రూమ్‌కు వెళ్లడానకి బస్సు కోసం చూస్తే సిటీబస్సు లేదు. షేర్‌ ఆటోలో వెళ్దాం అంటే రాత్రి కావడంతో ఎంత అడిగితే అంత ఇవ్వాలి. లేకపోతే ఇంటికి వెళ్లలేం. ఇలాంటి సన్నివేశాలకు ఇకపై కాలం చెల్లనుంది.

భాగ్యనగరంలో దూర ప్రాంతాలలో ఉండే  ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  రాత్రి పొద్దు పోయాక కూడా సిటీబస్సులను నడిపించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నిర్ణయించింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల తర్వాత బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. వారికి అండగా ఉండాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ట్రాఫిక్ సర్వే ఆధారంగా హయత్‌నగర్, ఎన్‌జీవో కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కుషాయిగూడ, కాళీమందిర్, జీడిమెట్ల, సీబీఎస్, కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు, బోరబండ, సుచిత్ర, మెహిదీపట్నం, తాళ్లగడ్డ, బడంగ్‌పేట్, ఉప్పల్ ప్రాంతాల ప్రజలకు కోసం పొద్దుపోయాక బస్సులు అవసరమని గుర్తించారు.  ఈ ప్రాంతాలకు అర్థరాత్రి వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు