ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

23 Mar, 2016 19:15 IST|Sakshi
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

- పెండింగ్ బకాయిల చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం
సాక్షి, హైదరాబాద్: . దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్‌ఎంయూ నేతలు బుధవారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావును కలసి చర్చించారు. దీంతో బకాయిలను ఏప్రిల్ 5లోగా చెల్లించేందుకు ఎండీ హామీనిచ్చారు. వేతన బకాయిలు(2013 నుంచి) ఒక నెల అరియర్స్, 2015లో జులై, ఆగస్టు, సెప్టెంబరుకు సంబంధించి డీఏ అరియర్స్‌ను వచ్చే నెల 5లోగా చెల్లించడానికి ఎండీ అంగీకరించినట్లు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, వర్కింగ్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తెలిపారు.

2013 నుంచి పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన వేతన బకాయిల్లో 50 శాతం ఏప్రిల్‌లో మంజూరు చేస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రత్యేక సెలవు, 2012కు ఇవ్వాల్సినలీవ్ ఎన్‌క్యాష్‌మెంటు ఈ ఏడాది మేలో ఇస్తామని ఎండీ తెలిపారని చెప్పారు. తిరుపతి, వైజాగ్, నెల్లూరు, కర్నూలులో స్టాఫ్ రెస్ట్ రూంలను ఏసీతో ఆధునికీకరించేందుకు, 126 డిపోల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని ఎన్‌ఎంయూ నేతలు తెలిపారు. అద్దె బస్సుల్లో డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇచ్చే విధానాన్ని విరమిస్తామని ఎండీ సాంబశివరావు అంగీకరించారని చెప్పారు.

మరిన్ని వార్తలు