బ్యాటింగ్ తో బంగ్లాపై టీమిండియా పోరు! | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ తో బంగ్లాపై సమరానికి రెడీ... ఫ్యాన్స్ ఛీర్స్!

Published Wed, Mar 23 2016 7:16 PM

బ్యాటింగ్ తో బంగ్లాపై టీమిండియా పోరు!

*బంగ్లాదేశ్ పై టీమిండియా ధాటిగా ఆడుతుందని అభిమానులు ఆశించగా.. ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ ప్రారంభించారు. అడపాదడపా ఫోర్లు కొడుతూ.. కొన్నిసార్లు తడబడుతూ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ చేశారు. దీంతో మొదటి ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 27 పరుగులే చేసింది.

*నాలుగో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన ధావన్. ధావన్ వ్యక్తిగత స్కోరు 13 పరుగులు. 4 ఓవర్లు ముగిసేసరికి 23 పరుగులు చేసిన టీమిండియా.

*  అల్ ఆమిన్ హోస్సైన్ వేసిన మూడో ఓవర్లలో రోహిత్ శర్మ ఓ ఫోరు కొట్టాడు. ఆయన వ్యక్తిగత స్కోరు 8 పరుగులకు చేరింది. మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 17 పరుగులు చేసింది.

* షువగత హామ్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ ధావన్ ఓ ఫోర్ కొట్టాడు. దీంతో ధావన్ వ్యక్తిగత స్కోరు 6కు చేరింది. రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 9 పరుగులు చేసింది.

* ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. మొదటి ఓవర్ లో సింగిల్స్ తో సరిపెట్టారు. బంగ్లా బౌలర్ మష్రఫ్ మోర్తాజా వేసిన మొదటి ఓవర్లో ధావన్, రోహిత్ చేరో రెండు పరుగులు రాబట్టారు. ఒక వైడ్ ద్వారా అదనపు పరుగు లభించింది. దీంతో మొదటి ఓవర్ లో టీమిండియా 5 పరుగులు చేసింది.
 

టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో కీలక పోరుకు ధోనీసేన సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా అభిమానులు ఉత్సాహం హోరెత్తుతోంది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ధోనీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది.

టీ 20 వరల్డ్ కప్ సెమిస్ బరిలో నిలువాలంటే టీమిండియా ఈ మ్యాచ్ లో మెరుగైన రన్ రేటుతో విజయం సాధించాల్సిందే. ఈ మ్యాచ్ లో  గెలుపుపై ధీమాతో ఉన్న ధోనీసేన ఎంతమేరకు రన్ రేటు మెరుగుపరుచుకోవాలన్న దానిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. న్యూజిలాండ్ చేతిలో ఓడి.. పాకిస్థాన్ పై విజయం సాధించి సెమిస్ పై దృష్టిపెట్టిన మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనిని ప్రస్తుతం నెట్ రన్ రేట్ ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుపై భారీగా విజయం సాధిస్తేనే టీమిండియా నెట్ రన్ రేటు మెరుగుపడే అవకాశముంది.

మరోవైపు ఈ మ్యాచ్ లో టీ-20 మజాను ఆస్వాదించేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. వారిలో ఉత్సాహం పెల్లుబుక్కుతోంది. తమ ఛీర్స్ తో వారు టీమిండియాను ఉత్సాహపరుస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement