-

‘డబుల్‌’ కు తక్కువ ధరకు స్టీల్‌

17 Feb, 2018 02:27 IST|Sakshi

టన్నుకు రూ.9,440 చొప్పున తగ్గించేందుకు కంపెనీల నిర్ణయం

నాలుగేళ్ల కాలయాపనతో ఖజానాకు భారం

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం ప్రారంభించినప్పుడు మార్కెట్‌లో స్టీల్‌ ధర టన్నుకు రూ.32,550.. ప్రస్తు తం అది రూ.53,100. ఇప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ధర తగ్గించేందుకు స్టీల్‌ కంపెనీల కూటమి అంగీకరించి శుక్రవారం ఖరారు చేసిన ధర రూ.43,660. అం టే టన్నుపై ఆదా అవుతున్న మొత్తం రూ.9,440. ఇదే కసరత్తు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం ప్రారంభించిన సమయంలో చేసి ఉంటే దీనికి రెట్టింపు ఆదా ఉండేది. సకాలం లో అధికారులు స్పందించకపోవటం, నిర్ణయాలు వేగంగా తీసుకోకపోవటం, ప్రభు త్వం సమీక్షించకపోవటంతో స్టీల్‌ రూపంలో ఖజానాపై భారీ భారం పడనుంది.

రూ.264 కోట్ల ఆదా..
డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనిట్‌ కాస్ట్‌కు, ఇంటి డిజైన్‌కు పొంతన కుదరకపోవటంతో ఇళ్ల నిర్మా ణాన్ని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇసుకను ఉచితంగా సరఫ రా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా స్పందన లేకపోవటంతో సిమెంటు కంపెనీలతో చర్చించి ధర కొంతమేర తగ్గిం చింది.  మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి రెండు పర్యాయాలు కంపెనీల ప్రతినిధులతో చర్చించడంతో ధర తగ్గించేందుకు అంగీకరించారు. 

శుక్రవారం మంత్రులతో జరిగిన చర్చల్లో ధర తగ్గించేందుకు అంగీకరించారు. గ్రామాల్లో లక్ష ఇళ్లకు 1.45 లక్షల టన్నులు, పట్టణాల్లో 60 వేల ఇళ్లకు 1.04 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లకు 2.78 లక్షల టన్నుల స్టీల్‌ అవసరమని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ భూంరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకరరెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు