ఆ వదంతులు నమ్మవద్దు: జబర్దస్త్ నటుడు

17 Jul, 2017 08:18 IST|Sakshi
ఆ వదంతులు నమ్మవద్దు: జబర్దస్త్ నటుడు

హైదరాబాద్ (బంజారాహిల్స్)‌: తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ప్రముఖ హాస్యనటుడు హైపర్‌ ఆది పేర్కొన్నారు. ఇటీవల తాను రహస్యంగా బుల్లితెర నటిని వివాహం చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోందని, ఇది పూర్తిగా అవాస్తవమని 'జబర్దస్త్‌' కామెడీ షో నటుడు చెప్పారు. పెళ్లి వదంతులపై బుల్లితెర నటుడు హైపర్‌ ఆది ‘సాక్షి’తో మాట్లాడారు.

తానింకా ప్రేమపై దృష్టిసారించలేదని, పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి చేసుకుంటానన్నారు. ఆట కదరా శివ అనే సినిమాలో తాను ఓ పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. దీప్తి అనే నటితో పెళ్లి సీన్‌ ఇటీవల చిత్రీకరించారని ఆ సీన్‌ను ఎవరో లీక్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారన్నారు. దానిని చూసి తన పెళ్లి జరిగిందంటూ ప్రచారం జరిగిందని ఆది వివరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని ఆయన వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని అయితే రెండేళ్లు ఆగాల్సిందేనని ఆది స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు