తొలి మహిళా లోకో పెలైట్

8 Mar, 2014 01:49 IST|Sakshi
తొలి మహిళా లోకో పెలైట్

కూత పెడుతూ పట్టాల వెంట పరుగులు తీసే రైలు ఎక్కడమంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అలాంటివారిలో సత్యవతి ఒకరు. కానీ ఆమెకు మాత్రం రైలు ఎక్కడంతో పాటు దాన్ని నడపాలన్నది కల.

ఆనాటి స్వప్ననాన్ని ఇప్పుడు నిజం చేసుకుని కుటుంబ  బండిని గాడి తప్పకుండా నడిపించే మహిళ రైలుబండిని సైతం పట్టాలపై పరుగులు తీయంచగలదని నిరూపించి చరిత్ర సృష్టించారు సత్యవతి. దక్షిణమధ్య రైల్వేలోనే తొలి మహిళా లోకో పెలైట్ ఆమె. బోగీల్లో నిశ్చింతంగా కూర్చున్న వేలాది మంది ప్రయాణికుల భద్రతే ఆ క్షణాన ఆమెకు ప్రాణప్రదం. విజయపథంలో దూసుకుపోతోన్న సత్యవతి నగరంలో ఎంఎంటీఎస్ రైలు నడుపుతున్నారు. ‘రైలు నడపాలనే’
 

ఆశయంతోనే  ఈ రంగంలోకి  ప్రవేశించారు. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. మహిళాదినోత్సవం సందర్భంగా
 ఆమె మాట్లాడుతూ.. తనను చూసిన ప్రయాణికులు ప్రశంసిస్తున్నారని, అవే తనకు అవార్డులని ఆనందం వ్యక్తం చేశారు.     
 
 

>
మరిన్ని వార్తలు