ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే అధికారిణిగా..!

4 Dec, 2023 11:47 IST|Sakshi

మహిళలు ఏ రంగంలోనై అలవోకగా దూసుకోపోగలరు అని రుజువు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రంగాలు పురుషులు మాత్రమే నెగ్గుకు రాగలరు అన్న దృక్పథాన్ని మార్చి అత్యంత కఠినతరమైన పనును కూడా చేయగలమని నిరూపించారు చాలామంది మహిళామణులు. ఫైర్‌ ఫైటర్‌ దగ్గర నుంచి లారీ డ్రైవర్‌ వరకు వివిధ రంగాల్లో తామెంటో నిరూపించుకున్నారు. మహిళ తలుచుకుంటే దేన్నేనా సాధించగలదు. ఆఖరికి యుద్ధ రంగంలో కూడా పురుషుడితో సమానంగా దాడి చేయలగలదు అనే ఆలోచనకు తెర తీసింది. ఇప్పుడిప్పడే మహిళలకు సాయుధ రంగంలో అవకాశాలు వస్తున్నాయి. ఇక యుద్ధ నౌకలకు ఇప్పటి వరకు షురుషులే కమాండర్‌గా విధులు నిర్విర్తించగా, ఇప్పుడు ఆ అత్యనన్నత  అధికారం ఓ మహిళ చేపట్టి అందరికి ప్రేరణగా నిలిచింది. 

వివరాల్లోకెళ్తే..భారత నావికదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణిగా నిలిచింది 'ప్రేరణ దేవస్థలీ'. పేరుకు తగ్గట్టుగానే అందరికి ప్రేరణగా నిలిచింది. అంచెలంచెలుగా భారత నావికదళంలో ఉన్నత పదవులను అలంకరించింది. ఆమె ప్రస్తుతం చైన్నైలోని యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌కి ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ హోదాలో పనిచేస్తోంది. ఆమె ఇప్పుడు ఓ యుద్ధ నౌకకే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ఈ మేరకు వెస్ట్రన్‌ ఫ్లీట్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ ప్రవీణ్‌ నాయర్‌ నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఇలా ఓ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ప్రేరణ దేవస్థలి నిలిచింది. ఆమె ఇప్పుడు ఇండియన్‌ నేవీ వెస్ట్రన్‌ ఫ్లీట్‌లో వాటర్‌ జెట్‌ ఫ్యాక్‌ ఐఎన్‌ఎస్‌ ట్రింకాట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించనుంది. ఆమె లెఫ్టినెంట్‌ కమాండర్‌ హోదాలో ఉండగా, టుపోలెవ్‌ టీయూ-42లో సముద్ర నిఘా విమానాల అబ్జర్వర్‌గా గుర్తింపు పొందారు. ఆమె 2009లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఆమె సోదరుడు, భర్త కూడా నావికదళ అధికారులే కావడం విశేషం. ప్రేరణ ఈ అత్యున్నత హోదాని దక్కించుకుని మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు అని ప్రూవ్‌ చేసింది. 

(చదవండి: అక్కాచెల్లెళ్ల హెల్త్‌ఫుల్‌ సప్లిమెంట్స్‌!)

>
మరిన్ని వార్తలు