పాలేరుపై టీపీసీసీ ప్రత్యేక వ్యూహం

1 May, 2016 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికపై టీపీసీసీ ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పాలేరులోని నాలుగు మండలాలకో సీనియర్ నేతను ఇన్‌చార్జీగా నియమించారు. వారికి సహకరించడానికి మరో ఆరుగురు సీనియర్లను బృం దంగా ఏర్పాటుచేశారు. వీరంతా వారికి కేటాయిం చిన మండలంలోనే ఉంటూ ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహం, ఓటింగ్ తదితర విషయాలను పర్యవేక్షిస్తారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలానికి మల్లు భట్టివిక్రమార్క ఇన్‌చార్జీగా నేత లు టి.రామ్మోహన్ రెడ్డి, కె.దామోదర్‌రెడ్డి తదితర 6గురు నేతలను బృందంగా నియమించారు.

తిరుమలాయపాలెం మండలానికి జి.వివేక్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి 6 గురు నేతల బృందానికి అప్పగించారు. కూసుమంచి మండలానికి టి.జీవన్ రెడ్డితో పాటు దొంతి మాధవ రెడ్డి, ఆకుల లలిత బృందానికి, ఖమ్మం రూరల్ మండలానికి పి.సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మా రెడ్డి, నేరెళ్ల శారద బృందానికి అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మొత్తం బృందాలను, ఎన్నికలను సమన్వయం చేస్తారు. వీటితో పాటు ఎన్నికల ముఖ్య సమన్వయకర్తలుగా సంభాని చంద్రశేఖర్, ఆర్.దామోదర్ రెడ్డి వ్యవహరించనున్నారు.

మరిన్ని వార్తలు