పోలీసుల దురుసు ప్రవర్తన.. రోజాకు గాయాలు

19 Dec, 2015 09:50 IST|Sakshi
పోలీసుల దురుసు ప్రవర్తన.. రోజాకు గాయాలు

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె గాయపడ్డారు. పోలీసులు రోజాను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె కిందపడిపోయారు. శనివారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన రోజాను గేటు వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు మార్షల్స్ నిరాకరించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రోజాను బలవంతంగా అసెంబ్లీ ప్రాంగంణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్ల రోజా గాయపడ్డారు. తర్వాత ఆమె సొమ్మసిల్లిపోయారు. వ్యాన్ లోంచి కిందకు దించేటప్పుడు కూడా ఆమె స్పృహలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఆమెను మహిళా కానిస్టేబుళ్లు చేతుల మీదుగా తీసుకురావాల్సి వచ్చింది.

 
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మూడో రోజు సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రోజాను అసెంబ్లీ బయట మార్షల్స్ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. నిన్న రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు