మీ ఫేస్‌బుక్‌లో వీటిని తొలగించడం మంచిది

11 Apr, 2018 20:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల అవకాశం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్‌ అగ్రగామి. గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థకు చేరుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. మిలియన్ల కొద్ది ఖాతాలు చోరికి గురయ్యాయి అని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తప్పును ఒప్పుకున్నారు. అయితే ఇలాంటి డాటా హ్యాకింగ్స్‌ నుంచి మీ ఖాతాను రక్షించుకోడానికి, ఒకవేళ ఖాతా హ్యాకింగ్‌కి గురి అయిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముఖ్యమైన ఈ 10 అంశాలను ఫేసుబుక్‌లో ఉంచకపోవడం మేలు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించడం ఉత్తమం. అవి,

1. పుట్టిన తేది: ఇది మీకు కేవలం ఒక తేదినే కావచ్చు కానీ హ్యాకర్లు వీటి ద్వారా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు చోరి కావచ్చు.
2. ఫోన్‌ నంబర్‌
3. మీ సన్నిహితులను ఫ్రెండ్స్‌ లిస్టులో ఉంచకపోవడం, హైడ్‌లో పెట్టడం. 
4. మీ కుటుంబ సభ్యుల ఫొటోలు, ముఖ్యంగా పిల్లల ఫొటోలు.
5. మీ పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలు. 
6. లోకేషన్‌ (మీరు ఉన్న ప్రదేశం)
7. మీ లోకేషన్‌ను ట్యాగ్‌ చేయకపోవడం ఉత్తమం.
8. ఫలనా చోటుకి వెళ్తున్నాం అని పోస్టులు చేయకండి.
9. క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు.
10. బోర్డింగ్‌ పాస్‌కు సంబంధించిన వివరాలు

మరిన్ని వార్తలు