హైతీలో భూకంపం.. 11 మంది మృతి

8 Oct, 2018 04:37 IST|Sakshi

పోర్టో ప్రిన్స్‌: కరీబియన్‌ దేశమైన హైతీలో శనివారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించింది. ఘటనలో 11 మంది మృతిచెందారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైంది. పోర్టో పేక్స్‌ నగరానికి వాయవ్యం వైపు 19కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూఉపరితలానికి 11.7 కి.మీ లోతున భూమి కంపించింది.  

మరిన్ని వార్తలు