20 ఏళ్ల తర్వాత రగిలిన చిచ్చు

3 Apr, 2016 08:37 IST|Sakshi

యెరెవన్: మరోసారి ఆర్మేనియా, అజర్బైజానీ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 ఏళ్లు దాటిని తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు గుండా ఇరు సైనికులు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో రెండు దేశాల సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.

హెలికాప్టర్లు, ట్యాంకర్లు, రాకెట్ లాంఛర్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 18మంది ఆర్మీనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 35మందికి పైగా గాయాలపాలయ్యారు. 1994 తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఇదే అతిపెద్ద సంఘర్షణ. నిత్యం ఘర్షణకు తావిచ్చే కరాబక్ జోన్ వద్దే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మేనియన్ అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు