Jammu Kashmir Encounter: భారీ ఎన్‌కౌంటర్‌. .ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్ద‌రు సైనికుల మృతి

22 Nov, 2023 21:27 IST|Sakshi

శ్రీన‌గ‌ర్: జ‌మ్ము క‌శ్మీర్‌లో బుధ‌వారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్ద‌రు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్‌ సమచారంతో ఆ‍ర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్‌ జరిగింది.  

కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్‌కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం  భద్రతా దళాలకు సవాలుగా మారింది.

గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్‌‌కౌంటర్‌లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
చదవండి: Air India: టాటా గ్రూప్‌ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..

మరిన్ని వార్తలు