కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్‌, డేటింగ్ వల: అదే కొంపముంచింది!

25 Nov, 2023 18:30 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్‌ డేటింగ్‌ టిండర్‌లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని  కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన  సంచలనం రేపింది.  2018లో జైపూర్‌లో  షాకింగ్ సంఘటన జరిగింది.  ఈ హత్య కేసులో  ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు  27 ఏళ్ల ప్రియా సేథ్‌తో టిండర్‌ యాప్‌ ద్వారా పరిచయమైంది.  దుష్యంత్‌ తను అసలు పేరు కాకుండా  వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని,  ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్‌మేన్‌ అని  గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి  ప్రొఫైల్‌ చూసిన ప్రియా  పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం  నటించింది. దీంతో దుష్యంత్‌ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు   కొనసాగింది.  చివరికి  కలవాలని  ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు.   కానీ అదే అతని ప్రాణాలు  తీస్తుందని అసలు ఊహించలేదు.

ఇక్కడే  అతడిని కిడ్నాప్‌ చేసిన పెద్ద  మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేయాలన్న తన ప్లాన్‌ను ప్రియా  అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్‌ చే చేసి జైపూర్‌లోని అద్దె ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్‌ను అమలు చేశారు. దుష్యంత్‌  తండ్రికి ఫోన్‌ చేసిన  10 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

దుష్యంత్‌ దగ్గరనున్న  ఏటీఎం కార్డునుంచి  రూ.20వేలు లాగేసుకున్నారు.  ఇంకా డబ్బులు  కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే  అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్‌ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్‌ ద్వారా తండ్రికి ఫోన్‌ చేసి డబ్బులు అడిగారు.  కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్‌ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్‌ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్‌ మృతదేహాన్ని పోలీసులు  అదే ఏడాది మే 4న గుర్తించారు.  ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 

తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి  ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్‌ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో  డేటింగ్‌ ద్వారా  ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ.

 

మరిన్ని వార్తలు