చైనాలో యాపిల్‌కు మరో ఎదురు దెబ్బ

12 Aug, 2017 15:57 IST|Sakshi
చైనాలో యాపిల్‌కు మరో ఎదురు దెబ్బ

బీజింగ్‌: అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ కు చైనాలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా 28 యాప్‌ డెవలపింగ్‌ కంపెనీలు యాపిల్‌ కంపెనీకి వ్యతిరేకంగా  ఫిర్యాదు నమోదు చేశాయి.  మార్కెట్‌ పవర్‌ దుర్వినియోగం,  యాపిల్‌ స్టోర్‌ కంట్రోల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ 28 యాప్‌ డెవలపర్లు గ్రూప్‌ ఈ ఫిర్యాదు దాఖలు చేసింది.

యాపిల్‌ తన ఆపరేటింగ్‌ సిస్టం దుర్వినియోగం చేస్తూ  చైనా యాప్‌ డెవలర్లను మోసం చేస్తోందని  ఈ గ్రూపు ఆరోపించింది.  అలాగే  ఎలాంటి కారణం లేకుండా చైనా యాప్‌లను తొలగిస్తూ , యాప్‌ కొనుగోలుకు ఎక్కువ చార్జీలను వసూలు  చేస్తోందనేది చైనా రెగ్యులేటరీ ప్రధాన ఆరోపణ. బీజింగ్-ఆధారిత డేర్ అండ్‌ సుయర్ అనే న్యాయ సంస్థ చైనాలో ఈ కేసుని నమోదు చేసింది. దీంతో   ఇప్పటికే చైనాలో నియంత్రణ సమస్యలు ఎదుర్కొంటున్న కుపెర్టినో ఆధారిత అమెరికన్ బహుళజాతి సాంకేతిక దిగ్గజం యాపిల్‌ మరిన్ని ఇబ్బందుల్లో పడిందని  మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

మరోవైపు ఈ పిర్యాదుపై యాపిల్‌ స్పందించింది. "స్థానిక చట్టాలు, నిబంధనలకు" కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.  చైనాలో లోకల్‌ డెవలపర్లతో తమ సత్సంబంధాలను మరింత విస్తరించనున్నామని చెప్పింది. 

కాగా గత నెల, ఆపిల్ చైనాలోని యాప్ స్టోర్ నుండి అన్ని ప్రధాన వీపీఎన్‌ యాప్‌లను  తొలగించింది. చైనాలో  వీపీఎన్‌ సర్వీసు ప్రొవైడర్లు ఆపిల్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టుగా  యాపిల్‌ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.  చైనాలో చట్టవిరుద్ధమైన  కంటెంట్‌ కలిగి ఉన్న కారణంగా వీటిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.

 

>
మరిన్ని వార్తలు