లారీ కంటేనర్‌లో 39 మృతదేహాలు!

23 Oct, 2019 16:06 IST|Sakshi

లండన్‌ : ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఓ టీనేజర్‌ సహా 39 మంది మృతదేహాలు ఓ లారీ కంటేనర్‌లో దొరికాయి. ఆ లారీ కంటేనర్‌ను నడుపుతున్న 25 ఏళ్ల యువకుడిని ఎస్సెక్స్‌ కౌంటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి బ్రిటన్‌కు బయల్దేరిన లారీ కంటేనర్‌ హోలీ హెడ్‌ వద్ద బ్రిటన్‌లోకి ప్రవేశించి లండన్‌లోని ఎస్సెక్స్‌ పారిశ్రామిక వాడ వద్దకు వచ్చినప్పుడు ఎస్సెక్స్‌ కౌంటీ పోలీసులు తనిఖీ చేయగా మృతదేహాలు బయటపడ్డాయి. అరెస్టయిన లారీ డ్రైవర్‌ ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి అని తేలింది. 

‘ఇంత మంది ప్రజల ప్రాణాలు పోవడం అత్యంత విషాదకరం. దీనికి బాధ్యులెవరో, అలా ఎందుకు చేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాం. వాస్తవాలు తెలియడానికి సమయం పట్టవచ్చు. బల్గేరియా నుంచి బయల్దేరిన ఈ కంటేనర్‌ శనివారం 19వ తేదీన హోలిహెడ్‌ వద్ద బ్రిటన్‌ భూభాగంలోకి ప్రవేశించింది. సరిహద్దుల్లో లారీ కంటేనర్‌ను కచ్చితంగా తనిఖీ చేస్తారు కనుక, అక్కడే మృత దేహాలు బయటపడాలి. అలా జరగలేదంటే దేశంలోకి ప్రవేశించాకే వారు మరణించి ఉండాలి. కంటేనర్‌లో మనుషులను అనుమతించరు మరి ఇది ఎలా జరిగిందీ? ముందుగా మృత దేహాలు ఏ దేశస్తులవో కనుగొని సరిహద్దు భద్రతా సిబ్బందిని సంప్రతించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతవరకు ఇంతకుమించి ఏమీ చెప్పలేం’ అని ఎస్సెక్స్‌ పోలీసు చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఆండూ మారినర్‌ స్థానిక మీడియాకు తెలిపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కసు వెళ్లగక్కిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తా: పాక్‌ సింగర్‌

ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మలేషియా ప్రధాని

‘ఉగ్ర మూకల విధ్వంసానికి పాక్‌దే బాధ్యత’

దుమారం రేపుతున్న ట్రంప్‌ ట్వీట్‌!

కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో!

మత్తు బాబులు; ఆ విమానంలో అన్నీ కష్టాలే..!

ఈనాటి ముఖ్యాంశాలు

ట్రాన్స్‌జెండర్‌పై సామూహిక అత్యాచారం

ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!

మరోసారి ట్రూడో మ్యాజిక్‌..

భారత్‌లో ఇలాంటి ఘటనలు విచారకరం: అమెరికా

‘ఘోస్ట్‌ బేబీ.. ఆయన్ని చంపేయాలి’

పెల్లుబికిన నిరసనలు.. మెట్రో స్టేషన్లకు నిప్పు

బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకంతో చిక్కుల్లో ఎయిర్‌హోస్టెస్‌

తనలాగా ఉన్న 8మందితో పరీక్షలు

ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?

ఈనాటి ముఖ్యాంశాలు

వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్‌ హ్యారీ

ఢాకాలో తాతల మేకోవర్‌..

న్యూయార్క్‌ నుంచి సిడ్నీకి 19 గంటల జర్నీ

‘కర్తార్‌పూర్‌’కు మన్మోహన్‌ రారు

8 వేల ఏళ్ల నాటి ముత్యం

పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ

భారత రాయబారికి పాక్‌ సమన్లు

థాయ్‌ చూపు భారత్‌ వైపు!

‘కర్తార్‌పూర్‌’ ప్రారంభ తేదీ ఖరారు

అతడ్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా బోర్‌ కొట్టదు

బ్రెగ్జిట్‌ ఆలస్యానికే ఓటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?