ప్రేమలేఖకు 61 మార్కులు..

26 Feb, 2017 02:29 IST|Sakshi
ప్రేమలేఖకు 61 మార్కులు..

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ క్షమాపణలు చెబుతూ తన ప్రియుడికి ఓ లేఖ రాసింది. మామూలుగా అయితే దాన్ని చదివిన ప్రియుడి మనసు కరిగి ప్రియురాలి చెంతకు చేరాలి లేదా తనకు ఇష్టం లేదంటూ తిరుగు జవాబు రాయాలి. కానీ అమెరికాలోని స్టెట్సన్‌ యూనివర్సిటీ విద్యార్థి నిక్‌ ఒకరు ప్రియురాలి లేఖలో తప్పులన్నింటినీ ఎంచి, వాటిని ఎర్ర ఇంకుతో పక్కన రాసి, ఆ లేఖను ట్వీటర్‌లో పెట్టాడు. ట్వీటర్‌లో ప్రస్తుతం ఆ లేఖ వైరల్‌గా మారిపోయింది.

తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ సదరు ప్రియురాలు ఓ సుదీర్ఘ లేఖ రాసింది. అందులో చాలా తప్పులు రాయడంతో ఆమె స్నేహితుడు నిక్‌.. వాటన్నింటినీ ఎర్ర ఇంకుతో మార్క్‌ చేశాడు. ‘‘మీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ క్షమాపణ లేఖ రాస్తే దానికి గ్రేడింగ్‌ ఇచ్చి, వెనక్కి తిప్పి పంపాలి’’ అని అంటూ నిక్‌ ఆ లేఖను ఫొటో తీసి ట్వీట్‌ చేశాడు. పరిచయం చాలా సుదీర్ఘంగా ఉందని, అందులో చాలా వాక్యాలు రిపీట్‌ అయ్యాయని నిక్‌ రాశాడు. నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదని ఆమె రాయగా.. దాన్ని రుజువు చేయడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని నిక్‌ పేర్కొన్నాడు. ఆమె రాసిన లేఖకు వందకు 61 మార్కులు ఇచ్చాడు. అతడి ట్వీట్‌ను లక్ష మందికి పైగా రీట్వీట్‌ చేయగా, 3 లక్షల లైకులు వచ్చాయి. అయితే మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ రాసిన లేఖను ఇలా బహిర్గతం చేయడం సరికాదని ఎక్కువ మంది తిట్టిపోశారు.

మరిన్ని వార్తలు