గోరక్షక దాడులు పెరిగాయి

16 Aug, 2017 01:44 IST|Sakshi

అమెరికా నివేదిక
వాషింగ్టన్‌:
2016లో భారత్‌లో గోరక్షక దాడులు పెరిగాయని అమెరికా అధికారిక నివేదిక ఒకటి తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ మతస్వేచ్ఛపై తెచ్చిన ఈ నివేదికను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ విడుదల చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక వచ్చిన తొలి నివేదిక ఇదే. ఈ దాడులు ముస్లింలపై ఎక్కువగా జరిగాయనీ, కొన్నిసార్లు అధికారులు విచారణ జరపడంలోనూ విపలమయ్యారని నివేదిక పేర్కొంది.

బీజేపీ ప్రభుత్వంలో హిందుత్వ వాదులు హిందూయేతరులపై హింసకు పాల్పడుతుండటంతో మైనారిటీ ప్రజలు భయంతో ఉన్నారని వెల్లడించింది. మతపరమైన హత్యలు, దాడులు, అల్లర్లు, వివక్ష, విధ్వంసం, మత విశ్వాసాలను పాటించకుండా అడ్డుతగలడం, మత మార్పిడులు వంటివి భారత్‌లో 2016 సంవత్సరంలో పెరిగాయని నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు