ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర

3 May, 2019 03:36 IST|Sakshi
అహ్మదాబాద్‌లో మసూద్‌ అజర్‌ ఫొటోను తగలబెడుతున్న బీజేపీ శ్రేణులు

జైషే చీఫ్‌ అజర్‌ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంపై విదేశాంగశాఖ

దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విపక్షం భయపడుతోంది: జైట్లీ

అది మీ ఒక్కరి ఘనతే కాదు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/ఐరాస: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్‌లో పుల్వామా ఉగ్రదాడి  ప్రస్తావన లేకపోవడాన్ని భారత్‌ తేలిగ్గా కొట్టేసింది. అజర్‌ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌ అజర్‌ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్‌ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు.

జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్‌ నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్‌ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్‌ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.  

గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్‌
అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్‌ ప్రతినిధి రాజీవ్‌ శుక్లా చెప్పారు.

పాక్‌ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి  
పాక్‌ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్‌ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.  

కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది
అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్‌ ట్రియాన్సా్యహ్‌ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ తీరును తప్పుపట్టిన బీజేపీ
ఈ విషయంలో కాంగ్రెస్‌ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని  బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్‌ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చివరి నిమిషంలో ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా: కుమారస్వామి ఉద్వేగం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!

అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్‌ షా

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

58 పురాతన చట్టాల రద్దు

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..