అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్‌ సైక్లోన్‌’

14 Mar, 2019 21:54 IST|Sakshi

అమెరికాలోని 25 రాష్ట్రాల్లో స్థంభించిన జనజీవనం

వేల సంఖ్యలో విమానాలు రద్దు 

డెన్వర్‌ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత  

ఎక్కడి వాహనాలు అక్కడే.. పాఠశాలల మూసివేత   

చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి. 
ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్‌ సైక్లోన్‌’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం