'జగ్మీత్‌ సింగ్‌కు నేను మద్దతుగా ఉన్నా'

19 Jun, 2020 11:03 IST|Sakshi
కెనడా ప్రధాని ట్రూడొ, ఇన్‌సెట్‌లో జగ్మీత్‌ సింగ్‌

కెనడా : న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ (ఎన్డీపీ) అధినేత జగ్మీత్‌ సింగ్‌ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన సభ్యుడి పట్ల వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా జగ్మీత్‌సింగ్‌కు తాను మద్దతుగా ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గురువారం తెలిపారు. కెనడాలో ఫెడరల్‌ పార్టీకీ నాయకత్వం వహించిన మొదటి సిక్కు సభ్యుడిగానూ, మైనారిటీగానూ జగ్మీత్‌ సింగ్‌ నిలిచారు. కాగా దేశంలోని ఫెడరల్‌ పోలీస్‌ ఫోర్స్‌ దైహిక జాత‍్యహంకారాన్ని గుర్తించడానికి ఎన్డీపీ మోషన్‌లో సంతకం చేయాలంటూ వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతను బుధవారం జగ్మీత్‌ సింగ్‌ అడిగారు. మోషన్‌లో సంతకం చేయడానికి బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ ఒప్పుకోకవడంతో జగ్మీత్‌ గొడపడ్డారు. దీంతో జగ్మీత్‌ పార్లమెంట్‌ నుంచి తాత్కాలిక బహిష్కరణకు గురయ్యారు.

ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ..' బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ వర్ణ వివక్షపై సంతకం చేయడానికి నిరాకరించడం నిరాశపరిచింది. మన దేశంలో ప్రతి భాగంలోనూ, ప్రతి సంస్థలోనూ దైహిక జాత్యహంకారం ఉంది. ఆ వివక్షతను గుర్తించి, దాన్ని పరిష్కరించడమే మొదటి అడుగుగా భావించాలి.దీనిపై ఎన్డీపీ నేత జగ్మీత్‌ సింగ్‌ చేసిన సూచనకు తాను మద్దతుగా ఉన్నా. ఒకే దేశంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఇలాంటి మంచి విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్డీపీ మోషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించిన బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి చెందిన నేతతో జగ్మీత్‌ గొడవపడ్డారు. దీంతో క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన జగ్మీత్‌ను పార్లమెంట్‌ చాంబర్‌ నుంచి బహిష్కరించారు. జగ్మీత్‌ క్షమాపణ చెబుతారనే అనుకుంటున్నా.. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే హౌస్‌ ఆఫ్‌ కామన్‌ అధ్యక్షుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పరిస్థితి అంతదూరం వెళ్లదనే నేను అనుకుంటున్నా.' అంటూ తెలిపారు. ('ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధం')

మొత్తం 338 సీట్లలో జగ్మీత్‌ నేతృత్వంలోని ఎన్డీపీకి 24 సీట్లు, వేర్పాటువాద సంస్థ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీకి 32 సీట్లు ఉన్నాయి. గత నెలలో జాత్యంహకార దాడిలో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్‌ ప్లాయిడ్‌కు మద్దతుగా వర్ణ వివక్షను రూపుమాపాలని, కెనడియన్‌ పోలీస్‌ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలంటూ పార్లమెంట్‌లో ఎన్డీపీ తన పోరాటం కొనసాగిస్తుంది.

మరిన్ని వార్తలు