చైనా హైవే.. మనకు ప్రమాదమే!

2 Oct, 2017 13:43 IST|Sakshi

లాసా నుంచి నైచీ వరకు

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు దగ్గరగా..!

బీజింగ్‌ : భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపం నుంచి చైనా నిర్మించి 409 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ రహదారి టిబెట్‌ రాజధాని లాసా నుంచి చైనాలోని నైచీ ప్రాంతాన్ని కలుపుతుంది. మధ్యలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దుకు అత్యంత సమీపం నుంచి వెళుతుంది. టోల్‌ ఫ్రీ అయిన ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే మీద గంటకు సగటున 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. టూరిస్టుల కోసమే ఈ రహదారి అని చైనా అధికారులు చెబుతున్నా.. సైనిక అవసరాలకే ఈ హైవేని ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే టిబెట్‌లోని అన్ని రకాల రహదారులను చైనా మిలటరీ అవసరాల కోసమే వినియోగిస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు