అద్భుతం.. రెండు కాళ్ల ఆవు

15 Oct, 2017 10:01 IST|Sakshi

సాక్షి వెబ్‌ : కొండకోనల నడుమ అదొక చిన్న గిరిజన గుంపు. అక్కడి ఓ పేద రైతు ఇల్లు ఇప్పుడొక చిన్నపాటి టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది. వారు ‘అద్భుతం’గా భావిస్తోన్న వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాస్తుల రాక అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

అవును. ఆ రెండు కాళ్ల ఆవు దూడను చూస్తే మీరు కూడా వావ్‌ అంటారేమో!

థాయిలాండ్‌లోని ఓ కుగ్రామంలో పెరుగుతోన్న రెండు కాళ్ల ఆవు దూడ వార్తను ‘థాయి స్మైల్‌’ అనే ఆన్‌లైన్‌ మీడియా కంపెనీ వెలుగులోకి తెచ్చింది. సాక్షి వెబ్‌. ‘వికలాంగ ఆవు పోరాటస్ఫూర్తి’ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టైన వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. సర్కస్‌ ఫీట్‌లా కనిపించే వాస్తవ దృశ్యాల్లో.. ఆ రెండు కాళ్ల దూడ నడుస్తున్న తీరు వింతగానూ, స్ఫూర్తిదాయకంగానూ ఉంటే,  దానిని ప్రేమగా పెంచుకుంటోన్న రైతు ఆదర్శవంతుడిలా కనిపిస్తాడు.

ఆధునిక దేశాల్లో వికలాంగ జంతువులకు కృత్రిమ అవయవాలు అమర్చడం సహజమే. టెక్సాస్‌(అమెరికా)కు చెందిన ఓ మహిళ.. కాళ్లు కోల్పోయిన తమ బర్రె దూడకు వేల డాలర్లు పోసి, ఆపరేషన్‌ ద్వారా  కృత్రిమ పాదాలు పెట్టించింది.(స్లైడ్‌లో సంబంధిత ఫొటోను చూడొచ్చు) ఇంకా కొన్ని దేశాల్లో వికలాంగ గొర్రెలు, కుక్కలు, పిల్లలులకు యంత్రాలను అమర్చి వాటి జీవితాలు సాఫీగా సాగేందుకు సహాయపడుతున్నారు. థాయ్‌లాండ్‌ రెండు కాళ్ల ఆవు దూడ కూడా నాలుగు కాళ్లపై నడిచేరోజు వస్తుందని, రావాలని ఆశిద్దామా...

మరిన్ని వార్తలు