ఆమెది ‘గుర్రంమొహం’: ట్రంప్‌

17 Oct, 2018 01:28 IST|Sakshi

వాషింగ్టన్‌: తనకు వ్యతిరేకంగా కోర్టు కెక్కిన నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌ను గుర్రంమొహం అంటూ దూషించడంతోపాటు అంతు చూస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించారు. ట్రంప్‌పై డేనియల్స్‌ వేసిన పరువు నష్టం కేసును కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టు జడ్జి కొట్టేశారు. కేసుకు అయిన ఖర్చును ట్రంప్‌కు చెల్లించాలని ఆమెను ఆదేశించారు. ఈ తీర్పుపై ట్రంప్‌ స్పందించారు.

‘ఇప్పుడిక ఆ గుర్రంమొహం సంగతి, ఆమె తరఫున వాదించిన లాయర్‌ సంగతి చూస్తా. ఆమెకు నా గురించి తెలియదు’ అంటూ ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా బెదిరించారు. 2006లో ట్రంప్‌ తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని స్టార్మీ ఆరోపించిన విషయం తెలిసిందే. 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 1.30 లక్షల డాలర్లు లాయర్‌ ద్వారా ట్రంప్‌ చెల్లించారని గతంలో చెప్పారు.

మరిన్ని వార్తలు