ట్రంప్‌ వస్తున్నాడు.. వస్తున్నాడు.. వస్తున్నాడోచ్‌!

4 Nov, 2017 15:47 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలకమైన ఆసియా పర్యటన ప్రారంభమైంది. 11 రోజుల ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసియాలోని కీలక దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఒక అమెరికా అధ్యక్షుడు చేపట్టిన సుదీర్ఘమైన ఆసియా పర్యటన ఇదే కావడం గమనార్హం. ఉత్తర కొరియా రెచ్చగొట్టే రీతిలో అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు చేస్తూ.. తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రంప్‌ పర్యటన లక్ష్యం ఇదే..!?
పట్టపగ్గాలు లేని రీతిలో ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలతో చెలరేగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి దీటైన జవాబు ఇచ్చేందుకు ట్రంప్‌ ఈ పర్యటన చేపట్టినట్టు భావిస్తున్నారు. జపాన్‌, దక్షిణ కొరియాతో ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడి.. ఉ.కొరియాపై చైనా కఠినంగా వ్యవహరించేలా ఒత్తిడి తేవాలని ట్రంప్‌ భావిస్తున్నారని, ఇదే పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్తున్నారు. ఇప్పటికే అణ్వాయుధ పరీక్షల విషయంలో ఉత్తరకొరియాతో ట్రంప్‌ మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు