కెనడీ హత్య ఫైల్స్‌ విడుదల

27 Oct, 2017 09:44 IST|Sakshi
జాన్‌ ఎఫ్‌ కెనడీ (ఫైల్‌)

వాషింగ్టన్‌ డీసీ : అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది. జాతీయ భద్రతా ఏజెన్సీల సూచనల మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని ప్రత్యేక ఫైళ్లను మాత్రం విడుదల చేయలేదు. మొత్తం 3,191 పైళ్లలో 2,891 ఫైళ్లను అధికారులు విడుదల చేశారు. కెనడీ హత్యకు సంబంధించిన ముఖ్యమైన 300 ఫైళ్లను మాత్రం ట్రంప్‌ విడుదల చేయలేదు.

అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా జాన్‌ ఎఫ్‌ కెనడీని 1963, నవంబర్‌ 22న హత్య  చేశారు. అప్పటినుంచి ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ హత్య ఒక మిస్టరీగా ప్రజలు భావిస్తారు. లీ హర్వీఏ ఓస్వాల్డ్‌ అనే హంతకుడు అధ్యక్షుడు కెనడీని హత్య చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు.

కెనడీ హత్య జరిగిన మూడు దశాబ్దాల తరువాత.. రికార్డ్‌ కలెక్షన్‌ యాక్ట్‌ -1992 ప్రకారం.. హత్య సంబంధించిన అన్ని ఫైళ్లను ఒకే చోటకు చేర్చాలని నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించి నేషలన్‌ ఆర్చీవ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఏఆర్‌ఏ)లో భద్రపరిచారు. ఆ సమయంలో ఈ ఫైళ్లను 2017 అక్టోబర్‌ 26న ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కీలకమైన ఫైళ్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హత్యకు సంబంధించిన కుట్రపై ప్రజలకున్న అనుమానాలు అలాగే మిగిలిపోతాయని చరిత్రకారులు అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్‌ మెక్సికో పర్యటన కూడా రహస్యంగానే మిగిలిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు