రికార్డు స్థాయిల్లో మార్కెట్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిల్లో మార్కెట్లు ప్రారంభం

Published Fri, Oct 27 2017 9:34 AM

Sensex, Nifty open at record highs

ముంబై : గురువారం ట్రేడింగ్‌లో రికార్డుల మోత మోగించిన మార్కెట్లు, నేటి ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను తాకాయి. 100 పాయింట్ల మేర సెన్సెక్స్‌ జంప్‌ చేయగా.. నిఫ్టీ 10,362 మార్కును తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభంలో 33,199 వద్ద, నిఫ్టీ 1.85 పాయింట్ల లాభంలో 10,345 వద్ద ట్రేడవుతున్నాయి. మెటల్‌, ఆటో స్టాక్స్‌ ర్యాలీ కొనసాగిస్తుండటంతో, మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకగలిగాయి. జోరు కొనసాగించిన బ్యాంకు స్టాక్స్‌, ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఫలితాల ప్రకటనాంతరం యస్‌ బ్యాంకు భారీగా 10 శాతం మేర కిందకి పడిపోతుంది. దీనికి గల ప్రధాన కారణం యస్‌ బ్యాంకు ఎన్‌పీఏలు మూడింతలు మేర పెరగడమే. ఐసీఐసీఐ బ్యాంకు కూడా తన ఫలితాలను నేడు ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ బ్యాంకు షేర్లు 2.5 శాతం కిందకి పడిపోయాయి. ఐటీసీ, మారుతీ, ఐఓసీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంలో 65.01 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 146 రూపాయల నష్టంలో రూ.29,248గా ఉన్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement