ట్రంప్‌ థమ్సప్‌ ఫోజు.. ఓ వివాదం

10 Aug, 2019 18:42 IST|Sakshi

పరిస్థితులకు తగ్గట్లు ప్రవర్తించడం నా డిక్షనరీలోనే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా ట్రంప్‌ భార్య మెలానియా ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో వివాదాస్పదమైంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడిని మెలానియా ఎత్తుకొనగా ట్రంప్‌ థమ్సప్‌ ఫోజు ఇచ్చారు. దీంతో ట్రంప్‌పై సోషల్‌మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. గతవారం అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్‌ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 32మంది వరకు మరణించారు. ఈ కాల్పుల్లో రెండునెలల బాలుడి తల్లిదండ్రులు చనిపోయారు. బాలుడికి సైతం బుల్లెట్‌ తగిలి రెండు చేతి వేళ్లు తెగిపోయాయి.

అయితే ఈ ప్రాంతాన్ని ఇటీవలే సందర్శించిన ట్రంప్‌ దంపతులు ఆ బాలుడిని ఎత్తుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంతవరకు ఓకే కానీ, ట్రంప్‌ థమ్సప్‌ ఫోజుతో చీర్స్‌ అన్నట్లుగా ఫోజు ఇవ్వడం పలువురి ఆగ్రహానికి కారణం అయింది. దీనిపై డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘ఎలాంటి సానుభూతి లేని ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయ్యాడని’ ఘాటుగా స్పందించారు. ట్రంప్‌ టెక్సాస్‌ పర్యటనకు మీడియాను అనుమతించలేదు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ట్రంప్‌పై వస్తున్న విమర్శలపై ఆయన సానుభూతిపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో కూడా తప్పులు వెతికి రాజకీయం చేస్తున్నారంటే నైతికత లేనిది మీకేనని ఎదురుదాడి చేస్తున్నారు. కాగా ట్రంప్‌ పక్కనే నిలబడిన వ్యక్తి ఆ బాలుడి అంకుల్‌. పనిలో పనిగా అతను ట్రంప్‌ భుజాలపై చేయి వేసి నవ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చేయడంపై ‘ట్రంప్‌ పక్కన ఉంటే ట్రంప్‌లాగే ఉంటారనడానికి చక్కటి ఉదాహరణ’ ఇదేనని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చిన్నదానివి అయినా చాలా గొప్పగా చెప్పావ్‌’

ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు

నాన్నను వదిలేయండి ప్లీజ్‌..!

అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!

ఎన్నారైలకు ఆధార్‌ తిప్పలు తప్పినట్లే..

ఆర్టికల్‌ 370 రద్దు;పాక్‌కు రష్యా భారీ షాక్‌!

మలేషియాలో క్షమాభిక్ష

భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...

అమెరికాలో డాక్టర్‌ దంపతులు దుర్మరణం

ప్రార్థనలు.. ప్రశాంతం!

నిజం చెప్పే నాలుక

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

ఉబెర్‌కు భారీ నష్టాలు

వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!

ఈ పూవుతో కేన్సర్‌ మందు!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

కశ్మీర్‌ అంశం: పాక్‌పై తాలిబన్ల ఫైర్‌!

ఆర్టికల్‌ 370 రద్దు; యూఎన్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు!

అమెరికాలో కత్తిపోట్లు..

‘సంఝౌతా’ నిలిపివేత

కశ్మీర్‌పై స్పందించిన బ్రిటన్‌ ప్రధాని

ఈనాటి ముఖ్యాంశాలు

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

పెద్ద సూపర్‌ మార్కెట్‌.. ఎక్కడ చూసినా ఎలుకలే

పాక్‌ మాజీ ప్రధాని కూతురు అరెస్ట్‌

పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం

ఆర్టికల్‌ 370 రద్దు: స్పందించిన మలాలా

వండుకుని తినేస్తా; పిచ్చి పట్టిందా ఏంటి?

పాక్ దూకుడుకు పెద్దన్న బ్రేక్‌

కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

సాహోతో సైరా!