ట్రంప్ అనూహ్య నిర్ణయం..

24 Sep, 2016 12:10 IST|Sakshi
ట్రంప్ అనూహ్య నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన ప్రచార వ్యయాన్ని అనూహ్యంగా పెంచారు. ఇప్పటి నుంచి ఎన్నికల తేదీ వరకు ప్రచార ప్రకటనల కోసం 140 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్ అడ్వైజర్ జెసన్ మిల్లర్ తెలిపారు. ఈ 140 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లను టెలివిజన్ యాడ్లకు ఉపయోగించనుండగా... మరో 40 మిలియన్ డాలర్లను డిజిటల్ యాడ్ల కోసం ఖర్చుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
 
ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి హిల్లరీ కంటే తక్కువ ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొస్తున్న ట్రంప్.. అనూహ్యంగా తన ప్రచార వ్యయాన్ని పెంచడం విశేషం. దీంతో హిల్లరీ అంచనాలు వారానికి 11 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ట్రంప్ 16 మిలియన్ డాలర్లతో ప్రచార వ్యయంలో దూకుడు పెంచారు.
మరిన్ని వార్తలు