పారేసుకోబోయి.. ఆరేసుకోవాలి

6 Feb, 2015 03:28 IST|Sakshi
పారేసుకోబోయి.. ఆరేసుకోవాలి

 సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ఈ సూత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీన్ ఎలిస్ బాగా ఒంటబట్టించుకుంది. చిరుగుల జీన్స్‌లనే ఎగబడి కొంటున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులతో రూపొందించే దుస్తులకు ఇంకెంత గిరాకీ ఉంటుందో కదా అని ఆలోచించింది. అంతే.. పారేసే వస్తువులతో ఇలా రకరకాల దుస్తులను రూపొందించింది. కాగితాలు, మేగజైన్లు, చాక్లెట్ రేపర్లు, చివరకు పేకముక్కలతో కూడా పలు డిజైన్లు తయారుచేసింది. చెత్తతో తయారుచేసినా కొత్తగా ఉంటే వింతే కదా..! క్రిస్టీన్ డిజైన్లకు తెగ డిమాండ్ వచ్చేసింది. 500 డాలర్ల (దాదాపు రూ.30 వేలు) నుంచి 1500 డాలర్ల (దాదాపు రూ.90 వేలు) మధ్య వాటి ధరలు నిర్ధారించినా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ఆమె వ్యాపార సామ్రాజ్యం కూడా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు విస్తరించింది.
 

>
మరిన్ని వార్తలు