ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు

26 Apr, 2015 09:22 IST|Sakshi

హైదరాబాద్: నేపాల్లో భూకంపం వచ్చిన సందర్భంగా భారత రాయబార కార్యాలయంలో ఎమర్జెన్సీ నంబర్లను ఏర్పాటు చేశారు. వాటి వివరాలు.. 009779851107021, 009779851135141 నంబర్లను సంప్రదించవచ్చు. అదే విధంగా తెలంగాణ నుంచి నేపాల్ వెళ్లిన వారి వివరాల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తెలంగాణ సచివాలయంలో రూంలో 040 - 23454088 ను సంప్రదించవచ్చు.

కాగా, కరీంనగర్కు చెందిన వాసులు దాదాపు 1000 మంది దాకా ఖాట్మండులో చిక్కుకున్నారు. సంచార జీవనం సాగించే బుడిగ జంగాల కులస్తులు, ఖాట్మండుకు 10 కిలో మీటర్ల దూరంలో నివాసం ఉండేవారు. భూకంప తీవ్రతకు వారి గుడిసెలు కూలిపోయాయి. ప్రస్తుతం వారు రోడ్డున పడ్డారు.

నేపాల్ నుంచి ఢిల్లీకి నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా 564 మంది భారతీయులను తరలించినట్టు సమాచారం. ఇప్పటికే నేపాల్కు 17 - 5MI విమానాలు చేరుకున్నాయి. మరో 10 విమానాల్ని పంపుతున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు