26 మంది చిన్నారుల సజీవదహనం

19 Sep, 2019 05:16 IST|Sakshi

లైబీరియా స్కూల్లో అగ్ని ప్రమాదం

మోన్‌రోవియా: లైబీరియా రాజధాని మోన్‌రోవియాలోని ఖురానిక్‌ స్కూల్లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు సజీవ దహనమయ్యారు. మొత్తం 28 మంది మృతి చెందారని దేశ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. ఘటనా స్థలాన్ని అధ్యక్షుడు సందర్శించారు.

మరిన్ని వార్తలు