మోదీ విమానానికి పాక్‌ నో

19 Sep, 2019 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ న్యూయార్క్‌ పర్యటన దృష్ట్యా పాకిస్తాన్‌ గగనతలం నుంచి విమానాన్ని అనుమతించాలన్న భారత విజ్ఞప్తిని పాకిస్తాన్‌ బుధవారం తిరస్కరించింది. ఎయిర్‌ ఇండియా వన్‌ విమానం కమర్షియల్‌ విమానం కాకపోయినప్పటికీ వీఐపీ విమానం కాబట్టి అనుమతించాలని భారత్‌ కోరింది. చుట్టూ తిరిగి ప్రయాణించడం వల్ల ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణ సమయం 45 నిమిషాలు అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. హూస్టన్‌ ప్రయాణానికి ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం ఇంధనం నింపుకోవాల్సి ఉంటుంది. నెలరోజుల క్రితం రాష్ట్రపతి కోవింద్‌ యూరప్‌ పర్యటన సమయంలోనూ పాక్‌ గగనతలంపై నుంచి విమానాన్ని అనుమతించాలన్న భారత్‌ విజ్ఞప్తిని ఆ దేశం తిరస్కరించింది. పాకిస్తాన్‌ అనుమతించని పక్షంలో ప్రధాని విమానం ముంబై, అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి మస్కట్‌ నుంచి యూరప్‌ వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు