ఇక క్లోనింగ్‌ పిల్లి కూనలు మార్కెట్లోకి

21 Aug, 2019 20:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనకు కుక్క పిల్లలంటే ఎంత ముద్దో. ఐరోపా దేశాల ప్రజలకు పిల్లి కూనలంటే అంతకంటే ఎక్కువ ముద్దు. ఇష్టపడి పెంచుకున్న పిల్లిగానీ, పిల్లి కూనగాని మరణిస్తే వారు కూడా మనిషి చనిపోయిన దానికన్నా ఎక్కువే బాధ పడతారు. అలాంటి వారికి అచ్చంగా చనిపోయిన పిల్లికూనలాంటి పిల్లికూననే అందిస్తే వారి ఆనందానికి అంతుండదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. చైనాలోని ఓ బయోటెక్నాలజీ కంపెనీ క్లోనింగ్‌ ద్వారా ‘బ్రిటిష్‌ షార్ట్‌ హేర్‌ కిటెన్‌’ను సృష్టించింది. బీజింగ్‌లోని సినోజీన్‌ బయోటెక్నాలజీ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి పిల్లి కూనకు జన్మనిచ్చింది. ఈ పిల్లి కూనకు ‘గార్లిక్‌’ అని నామకరణం కూడా చేశారు. 

హాంగ్‌ హూ అనే చైనీయుడి ఇష్టపడి పెంచుకున్న పిల్లి కూన మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌తో మరణించిందట. అచ్చం అలాంటి పిల్లి కూనే కావాలంటూ ఆయన సినోజీన్‌ బయోటిక్‌ కంపెనీని ఆశ్రయించారు. దాంతో వారు పిల్లి పిండాన్ని లాబరేటరీలో రూపొందించి ఓ అద్దె తల్లి (ఆడ పిల్లి) గర్భంలో ప్రవేశ పెట్టగా అది 66 రోజుల్లో గార్లిక్‌కు జన్మనిచ్చింది. చనిపోయిన పిల్లి,  క్లోనింగ్‌ ద్వారా పుట్టిన పిల్లి కూన చూడడానికి ఒకే లాగా ఉంటాయని, అయితే గుణ, గణాల్లో కచ్చితంగా తేడాలు ఉంటాయని నిపుణలులు తెలిపారు. అన్ని పిల్లుల్లాగానే క్లోనింగ్‌ పిల్లి కూనకు కూడా అంతే ఆయుర్దాయం ఉంటుందని వారు చెప్పారు. 

పిల్లి కూన క్లోనింగ్‌కు దాదాపు 30 వేల పౌండ్లు (26 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. ఇక ఎవరికి పిల్లి కూన క్లోనింగ్‌ కావాలంటే దాదాపు 26, 27 లక్షల రూపాయలకు చేస్తామని లాబరేటరీ వర్గాలు తెలిపాయి. కుక్క పిల్లల కోసం కూడా క్లోనింగ్‌ చేస్తామని, వాటికి 38 లక్షల నుంచి 46 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బయో టెక్నాలజీ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆత్మహత్య కోసం ఆమె దూకితే.....

ఎంపీ బిడ్డకు పాలు పట్టిన స్పీకర్; ప్రశంసలు!

మతిమరపు భర్తతో ఆమెకు మళ్లీ పెళ్లి

రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!

ప్రియాంకపై వేటు వేయండి : ఐరాసకు పాక్‌ లేఖ

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ

పామును అక్కడ వదిలేసి పోయాడు..!

మరణంలోనూ యాజమానికి తోడుగా..

ట్రైన్‌లో ఫోటోషూట్‌.. వైరలవుతోన్న వీడియో

‘మమ్మీ’ రాకుమారి తన దేశానికి వెళ్లిపోయింది

అమెరికా క్షిపణి ప్రయోగం సక్సెస్‌

ఫేస్‌బుక్‌ జర్నలిస్టులను నియమించుకుంటోంది!

పదోసారి తాత అయిన అమెరికా అధ్యక్షుడు

వీడిన ‘రూప్‌కుండ్‌’ మిస్టరీ!

ఇమ్రాన్‌..జాగ్రత్తగా మాట్లాడండి!

కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్‌

హింసాత్మక ఘటనపై చింతిస్తున్నా

‘సీనియర్స్‌’ కోసం..

ఈ నాణెం విలువ రూ. 9.5 కోట్లు

అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం: పాక్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘బెంజ్‌’ కార్లలో నిఘా నేత్రం

కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం: వెంకయ్య నాయుడు

నా ఇద్దరు మిత్రులతో మాట్లాడాను: ట్రంప్‌

ఆస్ట్రాయిడ్‌ భూమిని ఢీకొడితే : ఎలన్‌ మస్క్‌

మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!

కశ్మీర్‌లో పాఠాలు షురూ

హింసను రెచ్చగొట్టేలా ఇమ్రాన్‌ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌