అరుదైన పర్వత పులుల గుంపు ఇదే..!

17 Jan, 2020 17:06 IST|Sakshi

కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఎల్‌ డోరడో జాతీయ పార్కులో బుధవారం రాత్రి ఓ అరుదైన సన్నివేశం వెలుగుచూసింది. ఏకాంత జీవనాన్ని ఇష్టపడే ‘పర్వత పులులు’ గుంపుగా దర్శనమిచ్చాయి. కాన్పు అనంతరం ఏడాది కాగానే.. ఈ పులులు పిల్లల్ని సైతం వేటాడి తింటాయని అలాంటిది ఐదు పులులు ఒకే చోట చేరడం నమ్మలేకుండా ఉందని కాలిఫోర్నియా వైల్డ్‌లైఫ్‌ ప్రతినిధి పీటర్‌ టిరా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వేల కొలది వీడియోలు, ఫొటోలు వీక్షిస్తుంటామని ఇలాంటి సంఘటన ఎప్పుడూ కనపడలేదని అన్నారు. 

అయితే, టిరా వాదనతో జంతు శాస్త్రవేత్తలు ఏకీభవించ లేదు. ఆ ఐదు పులుల్లో ఒకటి పెద్దగా ఉందని, బహుశా అది తల్లి పులి కావొచ్చునని చెప్తున్నారు. సంయోగం సమయంలో పులులు జతగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ, ఇలా ఐదు పులులు గుంపుగా ఉంటడం అరుదైనా సన్నివేశమని వెల్లడించారు. పర్వత పులుల్లో సహనం తక్కువని, ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయని టిరా చెప్పుకొచ్చారు. పులుల స్థావరాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల సాయంతోనే అరుదైన ఫొటోలు చూడగలుగుతున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు