'నీటిలో బెడ్ రూం.. ఆ విల్లా ప్రత్యేకత'

25 May, 2016 15:59 IST|Sakshi
'నీటిలో బెడ్ రూం.. ఆ విల్లా ప్రత్యేకత'

ఎత్తైన భవంతిలోంచి బయటకు కనిపించే సుందరమైన దృశ్యాలతోపాటూ.. గదిలోంచే సముద్రపు అడుగు భాగంలోని అద్భుతమైన దృశ్యాలను తిలకించడానికి దుబాయి వేదిక కానుంది. ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫాతో ఇప్పటికే ప్రపంచ పర్యాటకులను దుబాయి ఆకర్షిస్తోంది. దుబాయి తీరప్రాంతంలో మానవ నిర్మిత దీవుల్లో తేలియాడే సీ హార్స్ విల్లాలు సిద్ధం అవుతున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

సముద్ర ఉపరితలంతో పాటూ అంతర్భాంగలో కూడా గదులు ఉండటం 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాల ప్రత్యేకత. సముద్రంలోపల గదులు ఉన్నా..దృఢమైన అద్దాల సహాయంతో ఎలాంటి ప్రమాదం లేకుండానే ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న పరికరాలు ఆ విల్లాలో ఉండటంతో ఒక దీవిలో ఉన్నామనే ఆలోచనే దరికి రాదు.

ఒక్కో విల్లా 4000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ టీవీలు,  ఎసీలు, స్విమ్మింగ్ పూల్స్తో పాటూ మరెన్నో సౌకర్యాలు ఫ్లోటింగ్ సీ హార్స్ ప్రత్యేకతలు. రిక్వెస్ట్ మీద పర్సనల్ చెఫ్ ను కూడా పెట్టుకునే అవకాశంఉంది.  యూరోపియన్ ఆర్కిటెక్టులు వీటికి డిజైన్ చేశారు. 2018 వరకు మొత్తం 125 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాలను దుబాయి తీర ప్రాంతాల్లో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు.

>
మరిన్ని వార్తలు