జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య.. మిలియన్‌ డాలర్ల బెయిల్‌

9 Jun, 2020 08:21 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాను అతలాకుతలం చేసిన ఆఫ్రికన్‌–అమెరికన్ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతో సంబంధం ఉన్న పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కి మిన్నియాపాలిస్‌ కోర్టు న్యాయమూర్తి మిలియన్‌ డాలర్ల (ఇండియన్‌ కరెన్సీలో రూ.7,55,25,050.00) పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. మే 25న జరిగిన ఘటనలో చౌవిన్‌, ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కి అతడి మరణానికి కారణమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మిన్నెసోటా రాష్ట్ర కోర్టు వీడియో ద్వారా చౌవిన్‌కు రెండవ డిగ్రీ హత్య, మూడవ డిగ్రీ హత్య, నరహత్య నేరాలకు శిక్ష విధించింది.

ఈ క్రమంలో హెన్నెపిన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జెన్నిస్ రెడింగ్, చౌవిన్‌కు షరతులుతో 1 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో, షరతులు లేకుండా 1.25 మిలియన్‌ డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. చౌవిన్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ఆయుధాలను తిరిగి ఇచ్చేయడమే కాక.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సెక్యూరిటీ విభాగాల్లో పని చేయకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక ఫ్లాయిడ్‌ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో చౌవిన్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులు హత్యకు సహకరించారనే అభియోగం మీద స్థానిక జైలులో ఉన్నారు. (పోలీస్‌ విభాగం రద్దుకు మినియాపోలిస్‌ సిటీ కౌన్సిల్‌ తీర్మానం)

మరిన్ని వార్తలు